బాలీవుడ్ హీరో హృతిక్‌రోషన్, నటుడు ఆదిత్యా పంచోలిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది హీరోయిన్ కంగనా రనౌత్. వీరిద్దరు మంచి మనసున్న వ్యక్తులని చెప్పింది. మహారాష్ర ప్రభుత్వం వల్ల తనకు ఎదురైన అనుభవాలను పంచుకొంటూ ఈ విధంగా మాట్లాడింది క్వీన్ కంగన.
"వివాదాలు, కేసులు, విమర్శలు, అవమానాలు ఇలా ఎన్నో సమస్యలను గత కొంతకాలంగా మాహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎదుర్కొంటున్నాను. వీటితో పోలిస్తే బాలీవుడ్ మాఫియా, హృతిక్‌రోషన్, ఆదిత్య పంచోలి దయగల వ్యక్తులని అనిపిస్తోంది" అని కంగన ట్విట్టర్ వేదికగా పేర్కొంది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.