తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'చై-సామ్ విడిపోవడానికి ఆ బాలీవుడ్ స్టారే కారణం' - Nagachaitanya Sam divorce

టాలీవుడ్ స్టార్​ కపుల్​ నాగచైతన్య, సమంత విడిపోవడంపై షాకింగ్ కామెంట్స్ చేసింది బాలీవుడ్ నటి కంగన రనౌత్(Kangana Samantha). వారిద్దరూ విడాకులు తీసుకోవడానికి కారణం ఓ బీటౌన్​ స్టార్​ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

Kangana samantha
కంగన రనౌత్

By

Published : Oct 3, 2021, 10:57 AM IST

Updated : Oct 3, 2021, 11:33 AM IST

అక్కినేని నాగచైతన్య-సమంతజంట.. తమ వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు అక్టోబర్​ 2న సంయుక్తంగా ప్రకటించారు. దీనిపై స్పందించిన బీటౌన్​ నటి కంగన రనౌత్​(kangana samantha) షాకింగ్​ కామెంట్స్ చేసింది. వారిద్దరూ విడిపోవడానికి ఓ బాలీవుడ్​ స్టార్​(Kangana on Aamir) కారణమని ఇన్​స్టా​లో పోస్ట్​ చేసింది.

"పదేళ్ల పాటు ప్రేమాయణం సాగించి.. నాలుగేళ్లపాటు వివాహబంధం కొనసాగించిన ఈ దక్షిణాది నటుడు అకస్మాతుగా తన భార్యకు విడాకులు ఇచ్చాడు. ఇటీవలే అతను ఓ బాలీవుడ్ సూపర్​ స్టార్​కు సన్నిహితుడయ్యాడు. ఆ స్టార్​ నటుడికి 'విడాకులివ్వడంలో దిట్ట' అనే పేరు కూడా ఉంది. ఎంతో మంది మహిళలు, పిల్లల జీవితాలను అతడు నాశనం చేశాడు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాననే విషయం అందరికీ తెలుసు. ప్రత్యేకంగా పేరు చెప్పాల్సిన పనిలేదు."

--కంగన రౌనౌత్, బాలీవుడ్ నటి.

ప్రస్తుతం విడాకుల సంఖ్య పెరుగుతుండటంపై కూడా కంగన తన అభిప్రాయాన్ని తెలిపింది. "బంధం విడాకులు ఇచ్చుకునేంత వరకు వెళ్లిందంటే అది తప్పకుండా పురుషుడి తప్పే అవుతుంది. దేవుడు స్త్రీ, పురుషులను ఇలాగే రూపొందించాడు. ఆడవాళ్లను బట్టలు మార్చుకున్నంత సులభంగా మార్చేసి.. బెస్ట్​ ఫ్రెండ్​ అని సంబోధించేవారిని అస్సలు క్షమించకూడదు. ఇలాంటి వారికి అభిమానులు, మీడియా వాళ్లు మద్దుతుగా ఉండటం మరింత బాధాకరం. విడాకులు ఇచ్చుకోవడం ఈ మధ్య బాగా పెరుగుతోంది" అని చెప్పింది కంగన.

కంగన రనౌత్ పోస్ట్

ఇటీవలే నాగచైతన్య(Nagachaitanya Sam divorce) బాలీవుడ్​ నటుడు ఆమిర్​ ఖాన్​కు సన్నిహితుడయ్యాడు. వారిద్దరు కలిసి 'లాల్​సింగ్​ చద్ధా' సినిమాలో నటిస్తున్నారు. కాగా, కొద్ది రోజుల క్రితమే ఆమిర్​ కూడా తన రెండో భార్యకు విడాకులిచ్చారు. ఈ నేపథ్యంలోనే.. చై-సామ్(chaysam) డివర్స్​ తీసుకోవడానికి కారణం ఆమిర్​ అంటూ పరోక్షంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది కంగన.

నాగ చైతన్య, సమంత

సిద్ధార్థ్ ట్వీట్ వైరల్..

చైసామ్(chaysam)​ జంట విడిపోవడంపై నటుడు సిద్ధార్థ్​ కూడా స్పందించాడు. 'స్కూల్​లో నేను నేర్చుకున్న మొదటి పాఠం.. మోసగాళ్లు ఎప్పుడూ బాగుపడరు, వాళ్ల జీవితం అంతే' అని ట్వీట్​ చేశాడు. అయితే.. సిద్ధార్థ్​ ఎవరు పేరూ చెప్పనప్పటికీ.. అది సమంతను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా, గతంలో సిద్ధార్థ్​-సామ్​ ప్రేమించుకున్నారని అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది.

సిద్ధార్థ్ ట్వీట్

ఇదీ చదవండి:

నాగచైతన్య, సమంత.. వీరి ప్రేమకథ మాయ చేసింది!

వెండితెరపైన ముచ్చటైన జంట చై-సామ్‌!

Last Updated : Oct 3, 2021, 11:33 AM IST

ABOUT THE AUTHOR

...view details