బాలీవుడ్ నటి కంగనా రనౌత్.. ఉన్నది ఉన్నట్లు మోహం మీదనే అనేస్తుందనే మాట చిత్రసీమలో వినిపిస్తోంది. 'మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ'లో శత్రువులను తుద్దముట్టింటే వీరనారిగా మెప్పించింది. నిజజీవితానికి వచ్చేసరికి తన కుటుంబ సభ్యులతో కలిసి చిన్నపిల్లలా మారిపోతుంది. లాక్‌డౌన్ కారణంగా చాన్నాళ్లు ఇంట్లోనే ఉన్న కంగన.. తాజాగా తన కుటుంబసభ్యులతో కలిసి మనాలి పిక్నిక్‌కు వెళ్లింది. ఈ సందర్భంగా ఆమె తన సోదరి రంగోలి చందేల్ కొడుకుతో కలిసి చేసిన అల్లరంతా అంతా ఇంతా కాదు. ఆ సంతోషాన్ని టీమ్ కంగన తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
ఇందులో కంగన చిన్నపిల్లలా మారి ఒక్కతే డ్యాన్స్ చేస్తూ, మరోచోట పార్క్లో రోలర్‌లా పైనుంచి కిందికి దొర్లుతూ నానా హంగామా చేసింది.