తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రామ మందిరంపై కంగనా రనౌత్ సినిమా - బాలీవుడ్ సినిమా వార్తలు

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తీసుకున్న నిర్ణయం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించింది కంగనా. అయితే రామ మందిర కథతో తన నిర్మాణ సంస్థలో తొలి సినిమా చేస్తున్నట్లు ప్రకటించింది.

కంగనా

By

Published : Nov 25, 2019, 2:55 PM IST

పలు విభిన్న పాత్రల్లో నటించి, ఎందరో ప్రేక్షకులను మెప్పించి బాలీవుడ్‌ క్వీన్‌గా పేరు తెచ్చుకుంది నటి కంగనా రనౌత్‌. ఇటీవల 'రాణీ ఆఫ్‌ ఝాన్సీ' పేరుతో ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసింది. ఈ నిర్మాణ సంస్థ ద్వారా ప్రేక్షకులను మెప్పించే చిత్రాలను తెరకెక్కిస్తానని కంగన తెలిపింది. తాజాగా తన నిర్మాణ సంస్థలో చేయనున్న మొదటి సినిమా గురించి వివరించింది.

'అపరాజిత అయోధ్య' పేరుతో అయోధ్యలోని రామమందిరం మీద ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించింది కంగన. వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభంకానున్నట్లు తెలిపింది. ఇప్పటికే దీనికి సంబంధించిన కథను 'బాహుబలి' సృష్టికర్త విజయేంద్రప్రసాద్‌ రాస్తున్నారని చెప్పుకొచ్చింది.

"ఎంతో కీలకమైన అయోధ్య మీదనే ఎందుకు సినిమా తీయాలనుకుంటున్నారు..?" అని ఓ విలేకరి కంగనాను ప్రశ్నించగా.. "కొన్ని వందల ఏళ్ల నుంచి రామమందిరం అనేది ఓ కీలక అంశంగా ఉంది. అయోధ్య కేసు దేశ రాజకీయాలను ఎంతగానో మార్చింది. అలాగే శతాబ్దాల నాటి ఈ వివాదం భారతదేశంలోని లౌకిక స్ఫూర్తిని ప్రతిబింబించే తీర్పుతో ముగిసిపోయింది. ఓ నాస్తికుడు భక్తుడిగా ఎలా మారాడో చూపించేదే మా 'అపరాజిత అయోధ్య'. ఓ రకంగా ఈ సినిమా నా వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. నేను నిర్మాతగా తెరకెక్కించబోయే మొదటి సినిమాకు ఈ కథ బాగుంటుందని భావించాను." అని కంగన తెలిపింది.

ఇవీ చూడండి.. నిర్మాతగా మారనున్న అక్కినేని కోడలు..!

ABOUT THE AUTHOR

...view details