తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఇక ఆపండి.. నేను రాజకీయాల్లోకి రావట్లేదు' - కంగనా రనౌత్ స్టోరీ

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ రాజకీయల్లోకి రాబోతుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది కంగన.

'ఇక ఆపండి.. నేను రాజకీయాల్లోకి రావట్లేదు'
'ఇక ఆపండి.. నేను రాజకీయాల్లోకి రావట్లేదు'

By

Published : Aug 15, 2020, 7:26 PM IST

తన పదునైన వ్యాఖ్యలు, ముక్కుసూటి ప్రవర్తనతో బాలీవుడ్​లో వివాదాస్పద నటిగా మారింది కంగనా రనౌత్. సుశాంత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ మాఫియా గురించి పెద్ద ఎత్తున మండిపడుతోంది. కొన్నిసార్లు ప్రధాని మోదీకి మద్దతుగా మాట్లాడుతూ వస్తోంది. దీంతో కంగన రాజకీయాల్లోకి రాబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే తనకు మొదటి నుంచి కొన్ని పార్టీలు టికెట్ ఇవ్వడానికి ప్రయత్నించాయని.. కానీ తనకు రాజకీయాలయంటే ఇష్టం లేదని వెల్లడించింది. తాజాగా ట్వీట్​లో ఈ విషయాన్ని వెల్లడించింది.

"నేను రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నందు వల్లనే మోదీ గారికి మద్దతు ఇస్తున్నానని భావించే ప్రతి ఒక్కరికీ ఒక విషయం స్పష్టంగా చెప్తున్నా. మా తాత వరుసగా 15 ఏళ్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. అందుకే 'గ్యాంగ్​స్టర్‌' చిత్రం తర్వాత దాదాపు ప్రతి ఏడాది కాంగ్రెస్‌ పార్టీ నుంచి నాకు ఎమ్మెల్యే టికెట్‌ ఆఫర్‌ వచ్చేది. 'మణికర్ణిక' చిత్రం తర్వాత భాజపా నుంచి కూడా నాకు ఎమ్మెల్యే టికెట్‌ ఆఫర్‌ వచ్చింది. ఒక ఆర్టిస్ట్‌గా నా పని అంటే నాకు ఎంతో ప్రేమ. రాజకీయాల గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఎవరికి మద్దతివ్వాలనేది నా వ్యక్తిగత విషయం."

-కంగనా రనౌత్, బాలీవుడ్ నటి

కంగనా రనౌత్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉంది. 'అపరాజిత అయోధ్య' పేరుతో ఓ సినిమాను నిర్మిస్తోంది. ఇందులో అయోధ్య రామ మందిర చరిత్ర కూడా ఉండబోతుందని ఇటీవలే స్పష్టం చేసిందీ నటి.

ABOUT THE AUTHOR

...view details