తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మూకదాడులపై ప్రముఖుల లేఖల యుద్ధం!

మూకదాడులపై సినీ, సాహితీ ప్రముఖుల మధ్య లేఖల యుద్ధం మొదలైంది. ప్రభుత్వ తీరును పరోక్షంగా తప్పుబడుతూ బుధవారం 49 మంది ప్రధానికి లేఖ రాయగా... నేడు మరో 61 మంది వారికి కౌంటర్ ఇచ్చారు. ఈమేరకు హీరోయిన్​ కంగనా రనౌత్​ సహా మరికొందరు మోదీకి మరో లేఖ రాశారు.

ప్రధానికి లేఖ: మరో వర్గంతో కంగనా ఫైర్​

By

Published : Jul 26, 2019, 2:25 PM IST

దేశంలో మూక దాడుల నియంత్రణకు సత్వర చర్యలు చేపట్టాలని ప్రధాని మోదీకి 49 మంది ప్రముఖులు బుధవారం ఓ లేఖ రాశారు. వీరికి వ్యతిరేకంగా మరో లేఖ రాశారు సినీ నటి కంగనా రనౌత్​ సహా 61 మంది ప్రముఖులు. గతంలో జరిగినవే అమానుష దాడులని, ఇప్పుడు పరిస్థితులు బాగానే ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

ఈ లేఖపై రచయిత ప్రసూన్​ జ్యోతి, క్లాసికల్​ డాన్సర్​, ఎంపీ సోనాల్​ మాన్​సింగ్​, వాయిద్యకారుడు పండిత్​ విశ్వ మోహన్​ భట్​, దర్శకనిర్మాతలు మధుకర్​ బండార్​కర్​, వివేక్​ అగ్నిహోత్రి సంతకాలు చేశారు. మన్యం ప్రజలను మావోలు చంపుతుంటే ఈ ప్రముఖులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

తొలి లేఖలో...

సమాజంలో అశాంతి నెలకొంటుందని పేర్కొంటూ సినీ ప్రముఖులు, విజ్ఞానవేత్తలు, అనుభవజ్ఞులతో కలిపిన 49 మంది బృందం బుధవారం ప్రధానికి బహిరంగ లేఖ రాసింది. అమానుష దాడులకు పాల్పడే వారికి సత్వరమే శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా ముస్లింలు, అణగారిన వర్గాలు, మైనార్టీలపై ఇలాంటి దాడులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. ఆ లేఖపై సంతకం చేసిన వారిలో దర్శకనిర్మాతలు అదూర్​ గోపాలకృష్ణ, అపర్ణ సేన్​, మణి రత్నం, శ్యామ్​ బెనగల్​, కేతన్​ మెహతా, గౌతమ్​ ఘోష్​ సహా సినీ నటులు సుమిత్ర ఛటర్జీ, రేవతి, రచయిత అమిత్​ చౌదరి, చరిత్రకారులు, విద్యావేత్తలైన అశిష్​ నంది, సుమిత్​ సర్కార్​, తనిక సర్కార్​, పార్థ ఛటర్జీ, రామచంద్ర గుహ, సింగర్​ సుభా ముద్గల్​ ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details