తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మెంటల్​ హై క్యా'లో  బాలీవుడ్​ క్వీన్​ - బాలీవుడ్​

బాలీవుడ్​ క్వీన్​ కంగనా రనౌత్​ 'మెంటల్​ హై క్యా' చిత్రంలో నటిస్తోంది. విలక్షణ నటుడు రాజ్​కుమార్ ​రావ్​కు జోడీగా కనిపించనుంది. తాజాగా పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం.

మెంటల్​ గర్ల్​గా  బాలీవుడ్​ క్వీన్​

By

Published : Apr 18, 2019, 7:32 AM IST

బాలీవుడ్​ తారలు రాజ్​కుమార్ ​రావ్​, కంగనా రనౌత్​ ప్రధాన పాత్రల్లో 'మెంటల్​ హై క్యా' చిత్రంలో నటించారు. టాలీవుడ్‌లో 'సైజ్​జీరో' చిత్రంతో ఆకట్టుకున్న దర్శకుడు ప్ర‌కాశ్ కోవెల‌మూడి... ఈ సినిమాతో బాలీవుడ్​లో అడుగుపెట్టనున్నాడు.

  • థ్రిల్ల‌ర్​గా రూపొందుతోందీ 'మెంట‌ల్ హై క్యా' సినిమా. ఈ చిత్ర పోస్టర్​లో హీరోహీరోయిన్లు నాలుక‌పై ప‌దునైన బ్లేడ్‌తో విభిన్నంగా కనిపించారు. జూన్ 21న సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు స‌న్నాహాలు చేస్తోంది చిత్రబృందం. రాజ్‌కుమార్ ​రావ్, కంగ‌నా ర‌నౌత్ రెండోసారి జతకట్టారు. ఇంతకు ముందు వీరిద్దరు 2014లో వచ్చిన క్వీన్​లో కలిసి నటించారు. మెంటల్ హై క్యా చిత్రాన్ని ఏక్తా క‌పూర్ నిర్మిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details