తెలంగాణ

telangana

ETV Bharat / sitara

kangana ranaut: 'ప్రజలు కోరుకుంటే రాజకీయాల్లోకి వస్తా' - kangana latest news

'తలైవి' ప్రమోషన్స్​లో నటి కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజలు కోరుకుంటే పాలిటిక్స్​లోకి వస్తానని తెలిపింది.

Kangana Politics
కంగనా రనౌత్

By

Published : Sep 9, 2021, 9:15 PM IST

ఎప్పుడూ ఏదో విషయంపై ట్వీట్ చేయడం, వ్యాఖ్యలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచే నటి కంగనా రనౌత్.. ఇప్పుడు అలాంటి దాని గురించే మాట్లాడింది. ప్రజలు కోరుకుంటే రాజకీయాల్లోకి వస్తానని చెప్పింది. 'తలైవి'(kangana thalaivi) ప్రచారంలో భాగంగా ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

కంగన తలైవి మూవీ పోస్టర్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత(jayalalitha) బయోపిక్​ 'తలైవి'. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాలో కంగన.. జయలలిత పాత్రలో నటించింది. ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, ప్రచార చిత్రాలు చిత్రంపై అంచనాల్ని పెంచేశాయి. సెప్టెంబరు 10 తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 'తలైవి' విడుదల కానుంది.

ఈ సినిమాలో కంగన జయగా, అరవిందస్వామి ఎమ్​జీఆర్ పాత్రలో కనిపించనున్నారు. ప్రకాశ్​రాజ్, పూర్ణ తదితరులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. విజయేంద్రప్రసాద్(K. V. Vijayendra Prasad) కథ అందించగా, ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details