తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కంగనా భరతనాట్యం భంగిమలు చూశారా..! - jayalalitha biopic

మనాలిలోని తన నివాసంలో భరతనాట్యం మెళకువలు సాధన చేస్తోంది బాలీవుడ్ నటి కంగనా రనౌత్​. ఈ వీడియోను ఇన్​ స్టాలో పోస్ట్ చేసింది కంగనా.

కంగనా రనౌత్​

By

Published : Nov 4, 2019, 8:17 PM IST

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్​ కోసం కంగనా రనౌత్ తీవ్రంగా శ్రమిస్తోంది. ఇప్పటికే భరతనాట్యం మేళకువలు నేర్చుకుంటోంది. తాజాగా మనాలిలోని తన నివాసంలో డ్యాన్స్​ నైపుణ్యాలను మెరుగుపరచుకునేందుకు సాధన చేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్​ స్టాలో పోస్ట్ చేసింది కంగనా.

"క్వీన్ ఎప్పటికీ విశ్రాంతి తీసుకోదు. తలైవి కోసం మనాలిలో భరతనాట్యం ప్రాక్టీస్ చేస్తున్నా. ఈ ఎపిక్ చిత్రం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నా" -కంగనా రనౌత్, బాలీవుడ్ నటి

ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్నాడు. తమిళంలో తలైవిగా.. హిందీలో జయ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ ఇంతకుముందు మద్రాస్ పట్టణం(1947 లవ్​స్టోరీ), దైవా తిరుముగల్ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇదీ చదవండి: 'రంగస్థలం'లో రామ్​చరణ్​ స్థానంలో లారెన్స్​!

ABOUT THE AUTHOR

...view details