పురుచ్చ తలైవి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తీస్తున్న చిత్రం 'తలైవి'. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్లో కనిపించనుంది. గతంలోనే ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. అయితే కంగనా సోదరి రంగోలి తాజాగా పోస్ట్ చేసిన ఓ ఫొటో ఆకట్టుకుంటోంది. జయ పాత్ర కోసం కంగనా, దాదాపు 20 కిలోలకు పైగా బరువు పెరిగినట్లు రాసుకొచ్చింది.
జయ పాత్ర కోసం 20 కిలోల బరువు పెరిగిన కంగనా - cinema news
జయలలిత బయోపిక్ 'తలైవి' కోసం దాదాపు 20 కిలోల బరువు పెరిగింది నటి కంగనా రనౌత్. ఈ విషయాన్ని ఆమె సోదరి రంగోలి వెల్లడించింది.
జయ పాత్రలో కంగనా
'తేజస్', 'ధాకడ్' సినిమాల షూటింగ్‌లకు త్వరలో కంగనా హాజరు కానుందని చెప్పింది రంగోలి. 'తలైవి' సినిమాకు ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. 'బాహుబలి' ఫేమ్ విజయేంద్ర ప్రసాద్ కథనందించారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ చిత్రం.. జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.