బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనారనౌత్.. ప్రస్తుతం తన స్వస్థలమైన మనాలీకి వెళ్లి శీతాకాల వాతావరణాన్ని ఆస్వాదిస్తోంది. షూటింగ్ల నుంచి విరామం తీసుకుని కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి మంచు కొండల్లో విహరిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్లో పంచుకుంది కంగనా సోదరి రంగోలీ.
మంచుకొండల్లో విహరిస్తున్న బాలీవుడ్ క్వీన్ - కరీష్మ కపూర్
బాలీవుడ్ క్వీన్ కంగనారనౌత్ ప్రస్తుతం విహారయాత్రలో ఉంది. షూటింగ్కు విరామాన్నిచ్చి స్నేహితులతో కలసి మంచుకొండల్లో విహరిస్తోంది.
మంచుకొండల్లో సేదతీరుతున్న బాలీవుడ్ క్వీన్
ప్రముఖ బాలీవుడ్ నటులు కరీనాకపూర్, కరీష్మాకపూర్, సైఫ్ అలీఖాన్, అనుష్కశర్మలు ప్రస్తుతం విహారయాత్రలో ఉండగా.. తాజాగా ఆ జాబితాలో కంగనా చేరింది. ఇటీవలే ఆమె నటించిన 'పంగా' సినిమా ట్రైలర్ విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఈ చిత్రంలోని నటనను తన తల్లికి అంకితమిస్తున్నట్లు ఇంతకు ముందే ప్రకటించింది కంగనా.
ఇదీ చదవండి:- వాళ్లను చూస్తుంటే పెళ్లి చేసుకోవాలని అనిపిస్తోంది!