తెలంగాణ

telangana

By

Published : Sep 11, 2020, 4:13 PM IST

ETV Bharat / sitara

సోనియాజీ.. మీ ప్రభుత్వం వేధిస్తోంది: కంగన

మహారాష్ట్ర ప్రభుత్వానికి బాలీవుడ్ నటి కంగనా రనౌత్​కు మధ్య వివాదం ముదురుతోంది. ఈ క్రమంలోనే శినసేన పార్టీని విమర్శిస్తూ పలు పోస్టులు పెడుతోంది కంగన. తాజాగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈ విషయంలో సూటిగా ప్రశ్నించింది.

kangana-demands-sonia-gandhis-intervention-to-stop-harassment
సోనియాజీ.. మీ ప్రభుత్వం వేధిస్తోంది: కంగన

మహారాష్ట్ర ప్రభుత్వం తన పట్ల వ్యవహరిస్తున్న తీరును చూస్తే బాధగా అనిపించడం లేదా అని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీని నటి కంగనా రనౌత్‌ ప్రశ్నించింది. ఈ మేరకు కంగన తన ట్విట్టర్ వేదికగా సోనియాను ఉద్దేశిస్తూ పలు ట్వీట్లు చేసింది.

"గౌరవనీయులైన కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ గారు.. మహారాష్ట్రలోని మీ ప్రభుత్వం నా పట్ల ప్రవర్తిస్తున్న తీరు చూస్తే ఓ మహిళగా మీకు బాధగా అనిపించడం లేదా? రాజ్యాంగ సృష్టికర్త బి.ఆర్‌.అంబేడ్కర్‌ మనకిచ్చిన రాజ్యాంగ నియమాలను పాటించమని మీ ప్రభుత్వానికి చెప్పలేరా? పశ్చిమ దేశాల్లో పుట్టి.. భారత్‌లో నివసిస్తున్న మీకు మహిళల పోరాటాల గురించి బాగా తెలిసే ఉంటుంది. మీ ప్రభుత్వం మహిళలను వేధిస్తూ.. చట్టాన్ని అపహాస్యం చేస్తోంది. ఇప్పటికైనా మీరు కలుగజేసుకుంటారని ఆశిస్తున్నా"

-కంగన ట్వీట్

బాల్ ఠాక్రే భయం అదే!

తనకిష్టమైన నాయకుల్లో బాలా సాహెబ్ ఠాక్రే ఒకరని తెలిపింది కంగన. అయితే ప్రస్తుతం ఆయన స్థాపించిన శివసేన పార్టీని చూసి బాలా సాహెబ్ భయపడుతున్నారని వెల్లడించింది. ఆ పార్టీ కాంగ్రెస్​ను తలపిస్తోందని చెప్పింది.

ఇటీవల ముంబయిని పీవోకేతో పోలుస్తూ కంగన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో శివసేన-కంగన మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇదే సమయంలో ముంబయిలోని కంగన ఆఫీస్‌ అక్రమ కట్టడమని పేర్కొంటూ బీఎంసీ అధికారులు కొంతమేర కూల్చివేశారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియా వేదికగా కంగన మహారాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు

ABOUT THE AUTHOR

...view details