Kangana ranaut news: ఎప్పుడు ఏదో విషయమై వివాదాల్లో ఉండే హీరోయిన్ కంగనా రనౌత్.. మరోసారి అలాంటిదే ఓ పోస్ట్ పెట్టింది. దక్షిణాదిలోకి బాలీవుడ్‌ను అనుమతించొద్దని, వాళ్లు ఇండస్ట్రీని పాడు చేస్తారనే అర్థం వచ్చేలా ఇన్‌స్టా స్టోరీ పెట్టింది. అలానే సౌత్ సినిమా ఇండస్ట్రీ సక్సెస్ కావడానికి గల కారణాలను రాసుకొచ్చింది.
1.భారతీయ సంస్కృతిలో దక్షిణాది హీరోలు బలంగా పాతుకుపోయారు.
2.పాశ్చత్య సంస్కృతికి ప్రభావితం కాకుండా తమ కుటుంబాలను ప్రేమిస్తూ, బంధాలకు విలువ ఇస్తారు.