బాలీవుడ్లో వివాదాస్పద వ్యాఖ్యలతో పాటు విభిన్న నటనతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటి కంగనా రనౌత్. ఈ మధ్య వరుస సినిమాలతో జోరు పెంచింది. 'మణికర్ణిక' లాంటి ప్రతిష్టాత్మక చిత్రం తర్వాత మరోసారి 'ధాకడ్' అనే భారీ యాక్షన్ సినిమా చేస్తోంది. ఈ మూవీలో కంగన లుక్ను విడుదల చేసింది చిత్రబృందం. గన్స్ పట్టుకుని ఉన్న పోస్టర్ చూస్తుంటే యాక్షన్ మోతాదు కాస్త ఎక్కువగా ఉన్నట్లే కనిపిస్తోంది.
ఇప్పటికే కంగన ఈ సినిమాపై స్పష్టతనిచ్చింది. హాలీవుడ్ స్థాయిలో ఓ చిత్రాన్ని తెరకెక్కించాలని ఉందని తెలిపింది. ఈ మూవీని కంగన స్నేహితులైన రాజీ ఘాయ్ తెరకెక్కిస్తుండగా.. సోహైల్ మక్లాయ్ దర్శకత్వం వహిస్తున్నాడు.