తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రముఖ ఫ్యాషన్​ మ్యాగ​జైన్​పై కంగన ఆగ్రహం

ఓ ఫ్యాషన్​ మ్యాగ​జైన్​ సంస్థ, అనుమతి లేకుండా కంగన ఫొటోలు ఉపయోగిస్తోందని నటి కంగనా రనౌత్​ బృందం ట్వీట్ చేసింది​. ఇలా వినియోగించి సొమ్ము చేసుకోవడం ఎంతవరకు న్యాయమని ఓ ప్రకటన ద్వారా ఈ నటి ప్రశ్నించింది.

By

Published : Jun 22, 2020, 1:50 PM IST

Updated : Jun 22, 2020, 2:38 PM IST

Kangana calls out stylist for using her pictures despite banning her from magazine
ప్రముఖ ఫ్యాషన్​ మ్యాగ్​జైన్​పై కంగన ఆగ్రహం

బాలీవుడ్​ క్వీన్​ కంగనా రనౌత్​ను ప్రముఖ ఫ్యాషన్ డిజైనింగ్​ సంస్థ ఐదేళ్ల క్రితం నిషేధించింది. అయితే నిషేధం ఉన్నప్పటికీ తన చిత్రాలను సదరు మ్యాగ​జైన్​లో ఉపయోగిస్తూ, వారు ప్రచారం చేసుకుంటున్నారని కంగనా రనౌత్​ బృందం ట్వీట్ చేసింది.​

కంగనా రనౌత్​ టీమ్​

"కంగనా రనౌత్​పై ఐదేళ్ల క్రితం వోగ్​ ఇండియా నిషేధం విధించింది. ఎందుకంటే ఆ సంస్థకు చెందిన ఫ్యాషన్ డిజైనర్​ అనైతా అదజానియా.. ప్రముఖ నిర్మాత కరణ్​ జోహర్​కు సన్నిహితులు కావడమే ఇందుకు కారణం. కంగనపై నిషేధం విధించినప్పటికీ ఆమె ఫొటోలు, వీడియోలను ఇప్పటికీ ఉపయోగిస్తూ సొమ్ము చేసుకుంటోంది సదరు సంస్థ."

-కంగనా రనౌత్​ టీమ్​ ట్వీట్

'ఫ్యాషన్'​ చిత్రం విడుదల సమయంలో తనను ఎంపిక చేశారని, ఆ తర్వాత ప్రియాంకా చోప్రాతో ఫొటోషూట్ చేశారని చెప్పింది కంగన. ప్రముఖ హీరోయిన్ల జాబితాలో లేకపోవడమే కారణమని అప్పుడు సంస్థ ప్రతినిధులు తనతో చెప్పినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.

2014లో ఓ కవర్ ఫొటోషూట్​​ కోసం తనను సంప్రదించారని, కానీ తనకు స్టైలింగ్ చేసేందుకు డిజైనర్​ అనైతా నిరాకరించిందని కంగన చెప్పింది. అప్పుడు అనైతా తన సహాయకుడిని పంపిందని తెలిపింది.

'క్వీన్​' సినిమా తర్వాత తరచుగా ఆ సంస్థ నిర్వహించే కార్యక్రమాలకు హాజరవుతూ, మ్యాగజైన్​ కవర్​ కోసం వారితో కలిసి పనిచేశానని కంగనా రనౌత్ చెప్పింది. అయితే ఫొటోషూట్​ల కోసం అనైతా డిజైనింగ్స్ అడగ్గా, ఆ సంస్థ సరిగా స్పందించకుండా తనతో విచిత్రంగా ప్రవర్తించారని తెలిపింది. అప్పటివరకు కేవలం వోగ్​తో రెండు కవర్​ ఫొటోల కోసమే పనిచేసినట్లు వెల్లడించింది. ఆ తర్వాత నిషేధం ఎదుర్కొంటున్నా.. తన ఫొటోలు, వీడియోలను వినియోగించి సొమ్ము చేసుకోవడం ఎంతవరకు న్యాయమని ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది​.

ఇదీ చూడండి... 'నన్ను చాలాసార్లు మానసికంగా హింసించారు'

Last Updated : Jun 22, 2020, 2:38 PM IST

ABOUT THE AUTHOR

...view details