తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సుశాంత్ విషయమై సంజన ఎందుకు మాట్లాడట్లేదు' - kangana ranaut

సుశాంత్​ విషయంలోని ఆరోపణలపై సంజన స్పందించకపోవడంపై కంగన మండిపడింది. ఎందుకు ఆమె ఎక్కువ సమయం తీసుకుంటోందని టీమ్ కంగనా రనౌత్​ ట్విట్టర్​లో ప్రశ్నించింది.

Kangana calls out Sanjana for not speaking up when blind items were assassinating Sushant's character
'ఈ విషయంపై సంజన ఎందుకు స్పందించడం లేదు'

By

Published : Jul 23, 2020, 10:15 AM IST

బాలీవుడ్​ నటుడు సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​ ఆకాల మరణంపై నిరంతరం తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్న నటి కంగనా రనౌత్​.. తాజాగా మరో అంశం లేవనెత్తింది. 'దిల్ బెచారా' హీరోయిన్​ సంజనా సంఘీపై సుశాంత్​ అత్యాచారం చేశాడన్న ఆరోపణలపై సదరు నటి స్పందించకపోవడంపై విచారం వ్యక్తం చేసింది. అతడితో తనకున్న రెండేళ్ల స్నేహాన్ని తెలియజేసేందుకు సంజన ఎందుకు ఆలోచిస్తోందని ప్రశ్నించింది.

కంగనా రనౌత్​ టీమ్​ ట్వీట్​

"సుశాంత్​.. సంజనపై అత్యాచారం చేశాడని చాలామంది అంటున్నారు. ఈ రోజుల్లో ఇలాంటి పుకార్లు రావడం సాధారణం. కానీ, ఈ విషయంపై స్పందించడానికి ఆమె ఎక్కువ సమయాన్ని ఎందుకు తీసుకుంటుంది? సుశాంత్​తో ఉన్న స్నేహాన్ని ఎందుకు వ్యక్తపరచలేదు?"

-టీమ్​కంగనా రనౌత్ ట్వీట్​

సుశాంత్​ మృతిపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా ఇటీవలే సంజనను దాదాపు ఏడు గంటలపాటు ముంబయి పోలీసులు ప్రశ్నించారు.

సుశాంత్​ మృతిపై న్యాయం జరిపించాలని డిమాండ్​ చేస్తూ, క్యాబినెట్ మాజీ మంత్రి సుబ్రమణియన్​ స్వామి తరపు న్యాయవాది ఇష్కరన్​ సింగ్​ భండారి.. 'క్యాండిల్​ ఫర్​ ఎస్​ఎస్​ఆర్​' ఆన్​లైన్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో సుశాంత్​ మాజీ ప్రియురాలు అంకితా లోఖండే, కంగనా రనౌత్, శేఖర్​ సుమన్ తదితరులు పాల్గొన్నారు. ​

ABOUT THE AUTHOR

...view details