తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నేను హృతిక్‌నైతే అలా.. సల్మాన్‌నైతే ఇలా' - If A woke up as a hritik rosan says kangana

బాలీవుడ్​ నటి కంగనా రనౌత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సమాధానాలు చర్చనీయాంశంగా మారాయి. మీరు హృతిక్​, సల్మాన్​లా మారిపోతే ఏం చేస్తారు అన్న ప్రశ్నకు ఆసక్తికరంగా జవాబిచ్చింది బాలీవుడ్ క్వీన్.

కంగనా

By

Published : Sep 29, 2019, 8:00 PM IST

Updated : Oct 2, 2019, 12:24 PM IST

ప్రముఖ బాలీవుడ్‌ నాయకానాయికలు హృతిక్‌ రోషన్, కంగనా రనౌత్‌ మధ్య ఉన్న వివాదం గురించి అందరికీ తెలిసిందే. హృతిక్‌ తనతో కొన్నాళ్ల పాటు సన్నిహితంగా ఉండి ఆ తర్వాత మోసం చేశాడంటూ ఆ మధ్య తీవ్ర విమర్శలు చేసిందీ భామ. అప్పటి నుంచి సందర్భం దొరికినప్పుడల్లా హృతిక్‌పై నిప్పులు చెరుగుతూనే ఉంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కంగనకు ఈ హీరో గురించి ఊహించని ప్రశ్న ఎదురైంది. ప్రతిగా ఆమె చెప్పిన సమాధానం చర్చనీయాంశం అవుతోంది.

కంగనా

"మీరు ఓ రోజు ఉదయం లేవగానే హృతిక్‌లా మారిపోతే ఏం చేస్తారు?" అని కంగనను అడిగితే, దానికి ఆమె బదులిస్తూ "నేను హృతిక్‌లా మారిపోతే వెంటనే కంగనకు ఫోన్‌ చేసి క్షమాపణలు అడుగుతాను. మన మధ్య జరిగిందేదో జరిగింది. ఈ విషయంలో నేను చేసిన పనికి మన్నించమంటాను" అని చెప్పింది.

"సల్మాన్‌ ఖాన్‌లా మారిపోతే ఏం చేస్తారు" అని అడగ్గా... "మీడియా వారి చెవులు మెలేస్తాను. ఎందుకంటే ఆ పని సల్మాన్‌ చేస్తే మీడియాకు ఓకే. కానీ నేను చేస్తే మాత్రం ఓకే కాదు కదా" అని నవ్వుతూ బదులిచ్చింది కంగన.

ఇవీ చూడండి.. పోలీస్ దుస్తుల్లో హీరో రవితేజ ఐదోసారి..!

Last Updated : Oct 2, 2019, 12:24 PM IST

ABOUT THE AUTHOR

...view details