ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం కాంచన-3. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. హరర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఓవియా, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.
నువ్వు మాస్ అయితే.. నేను డబుల్ మాస్ - kanchana 3
ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రూపొందుతున్న కాంచన-3 చిత్ర ట్రైలర్ విడుదలైంది. 'ముని' సిరీస్లో నాలుగో చిత్రంగా వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను మరోసారి భయపెట్టనుంది.
కాంచన 3
'ముని' సిరీస్లో నాలుగో చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో హరర్ అంశాలు పుష్కలంగా ఉన్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఏప్రిల్ 19న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
ఇవీ చూడండి..'అవెంజర్స్ ఎండ్ గేమ్' ఎండ్ చాలా దూరం