తెలంగాణ

telangana

ETV Bharat / sitara

లారెన్స్​ దర్శకత్వంలో అక్షయ్​కుమార్..

తెలుగులో ఘనవిజయమైన 'కాంచన' చిత్ర హిందీ రీమేక్​లో అక్షయ్​కుమార్ నటించనున్నాడు. కియారా అడ్వాణీ కథానాయిక. మాతృకను తెరకెక్కించిన రాఘవలారెన్సే హిందీలోనూ దర్శకత్వం వహించనున్నాడు.

By

Published : Apr 21, 2019, 10:35 AM IST

లారెన్స్ - అక్షయ్

2011లో ఘనవిజయం సాధించిన 'కాంచన' సినిమా హిందీలో రీమేక్​ కానుంది. బాలీవుడ్​లో తెరకెక్కబోయే ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, కియారా అడ్వాణీ హీరోహీరోయిన్లుగా నటించబోతున్నారు. హిందీలోనూ లారెన్సే దర్శకత్వం వహించనున్నాడు. 'ముని' చిత్రానికి సీక్వెల్​గా తెరకెక్కిన ఈ సినిమా రాఘవ లారెన్స్​కు మంచి గుర్తింపు తెచ్చింది.

ఇప్పటివరకు ముని సిరీస్​లో నాలుగు చిత్రాలు రాగా.. అన్నీ సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. ఇటీవల విడుదలైన కాంచన- 3 చిత్రం తెలుగు, తమిళ భాషల్లో కాసుల వర్షం కురిపిస్తోంది. లారెన్సే హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రాలు మంచి విజయాలు అందుకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details