తెలుగు, తమిళంలో విజయం సాధించిన చిత్రం 'కాంచన'. ఈ సినిమాను హిందీలో 'లక్ష్మీ బాంబ్' పేరుతో రీమేక్ చేయనున్నారు. నేడు ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. అక్షయ్‌కుమార్, కియారా అడ్వాణీ, తుషార్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మాతృకను తెరకెక్కించిన రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నాడు.
'కాంచన' హిందీ రీమేక్ చిత్రీకరణ ప్రారంభం - lawrence
'కాంచన' చిత్రం హిందీ రీమేక్ చిత్రీకరణ నేడు ప్రారంభమైంది. 'లక్ష్మీబాంబ్' పేరుతో బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకురానున్నాడు లారెన్స్. అక్షయ్ కుమార్, కియారా అడ్వాణీ హీరో హీరోయిన్లు.
లక్ష్మీబాంబ్
హారర్ కామెడీగా 2011లో విడుదలైంది కాంచన. 'ముని' చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా లారెన్స్‌కు దర్శకుడిగానే కాకుండా హీరోగానూ మంచి గుర్తింపుతెచ్చింది. ఈ మూవీ రీమేక్‌తో దర్శకుడిగా బాలీవుడ్‌కు పరిచయమవుతున్నాడు లారెన్స్.
షబీనా ఖాన్, తుషార్ కపూర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఫర్హాద్ సామ్జీ ఈ సినిమాకు రచయిత. 2020లో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.