100 కోట్ల క్లబ్లో లారెన్స్ 'కాంచన-3' - రాఘవ లారెన్స్
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ తాజాగా నటించిన చిత్రం 'కాంచన 3'. ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లోనే 100 కోట్లు వసూలు చేసింది.

100 కోట్ల క్లబ్లో లారెన్స్ 'కాంచన3'
'ముని' చిత్రం నుంచి హారర్ కథాంశాలతో అలరించడం ప్రారంభించాడు లారెన్స్. తాజాగా ఆయన నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన 'కాంచన 3' బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 19న విడుదలై.. వారం రోజుల్లోనే 100 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 2,600 థియేటర్లలో రిలీజైంది. లారెన్స్ సరసన వేదిక, ఓవియా, నిక్కీ తంబోలి కథానాయికలుగా నటించారు.