Kamal Hassan: కమల్ హాసన్‌కు కరోనా సోకిన సమయంలో శ్రీరామచంద్ర హాస్పిటల్‌లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు కూడా కమల్ హాసన్ అదే హాస్పిటల్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే ఇందులో ఆందోళన చెందాల్సిన విషయం ఏమీ లేదని, రెగ్యులర్ చెకప్ కోసమే ఇలా వెళ్లాడని తెలుస్తోంది. కొన్ని పరీక్షలు చేయించకున్న తరువాత సాయంత్రానికళ్లా డిశ్చార్జ్ అవుతారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
Kamal Hassan: మరోసారి ఆస్పత్రికి కమల్ హాసన్.. అందుకోసమేనట..! - కమల్ హాసన్
Kamal Hassan:కమల్ హాసన్ తాజాగా హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. రెగ్యులర్ చెకప్ కోసమే వెళ్లినట్టు తెలుస్తోంది. కమల్ హాసన్ ఈ వీకెండ్‌లో బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌లో సందడి చేశారు. అయితే ఇలా మళ్లీ హాస్పిటల్‌కు వెళ్లడంతో ఆయన అభిమానులు కాస్త కంగారు పడ్డారు. కమల్ హాసన్ కరోనా బారిన పడినప్పుడు ఏ హాస్పిటల్‌కు అయితే వెళ్లారో ఇప్పుడు కూడా అదే హాస్పిటల్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది.
కమల్ హసన్
Kamal Hassan: అయితే ఇప్పుడు కమల్ హాసన్ వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విక్రమ్ సినిమాను పూర్తి చేసేందుకు సిద్దంగా ఉన్నాడు. కరోనా రావడంతో షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారు. లేదంటే ఈ పాటికే సినిమా షూటింగ్ దాదాపుగా అయిపోయేది. ఈ చిత్రం తరువాత ఇక కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యే చాన్స్ ఉంది. శంకర్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ సినిమాకు ఆది నుంచి అడ్డంకులే ఏర్పడుతున్నాయన్న సంగతి తెలిసిందే.
ఇదీ చూడండి: