కమల్‌హాసన్ హీరోగా దర్శకుడు శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'భారతీయుడు2'. మొన్నటి వరకు శరవేగంగా సాగిన చిత్రీకరణ కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ వల్ల మధ్యలోనే నిలిచిపోయింది. షూటింగ్ సమయంలోనూ అపశృతి చోటుచేసుకుని ముగ్గురు మరణించారు.
నవంబరులో 'భారతీయుడు 2' షూటింగ్! - latest director shankar movies
ప్రముఖ దర్శకుడు శంకర్ డైరెక్షన్లో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'భారతీయుడు 2'. కరోనా కారణంగా నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్ నవంబరులో ప్రారంభం కానున్నట్లు సమాచారం.
అయితే, ఇటీవలే షూటింగ్‌లకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ క్రమంలోనే నవంబర్‌లో ఈ సినిమా చిత్రీకరణ తిరిగి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కమల్‌హాసన్ తమిళనాడులో సొంత రాజకీయ పార్టీ పెట్టాడు. వచే ఏడాది ఫిబ్రవరిలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. అందువల్ల సాధ్యమైనంత త్వరగా షూటింగ్ ముగించుకుని రాజకీయాలవైపు దృష్టిపెట్టాలని కమల్ భావిస్తున్నాడట.
గతేడాది స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా సేనాపతిగా కమల్‌హాసన్ లుక్‌తో ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. దీనికి విపరీతమైన స్పందన లభించింది. ఈ సినిమాలో కమల్‌కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్ సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.