తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మహా' మలుపుల గురించి 39 ఏళ్ల క్రితమే చెప్పిన కమల్!​​

మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న మలపులు అచ్చం త్రిల్లర్​ సినిమాను తలపించాయి. ఎప్పుడు ఏ రోజు ఎవరు సీఎంగా ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ పరిణామాలకు తగ్గట్లు 39 ఏళ్ల క్రితమే ప్రముఖ నటుడు కమల్ హాసన్​ నటించిన 'ఆకలి రాజ్యం' సినిమాలో కొన్ని డైలాగ్స్​ చెప్పాడు. ఇప్పుడు ఆ సన్నివేశం వైరల్​ అవుతోంది.

kamal hasan movie akali rajyam scene viral now
'మహా' రాజకీయాల గురించి 39ఎళ్ల క్రితమే చెప్పిన కమల్​హాసన్​

By

Published : Nov 27, 2019, 9:12 PM IST

మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతున్నాయో ఎవరికీ అర్థం కావట్లేదు. క్షణానికో మలుపు.. రోజుకో సీఎం అన్నట్లుగా ఇక్కడి పరిస్థితి ఉంది. ఈ 'మహా' నాటకానికి ఎప్పుడు తెరపడుతుందా అని సామాన్య పౌరుడు సైతం ఆసక్తిగా చూస్తున్నాడు. ఇదిలా ఉండగా మహారాష్ట్రలో తాజాగా నెలకొన్న రాజకీయ పరిస్థితులను ప్రముఖ తమిళ నటుడు కమల్‌ హాసన్‌ 39ఏళ్ల క్రితమే ఊహించినట్లు ఈ వీడియో చూస్తుంటే అనిపిస్తోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిపై 'ఆకలి రాజ్యం' సినిమాలో కమల్‌హాసన్‌ చెప్పిన డైలాగ్‌ ఇప్పుడు విపరీతంగా వైరల్‌ అవుతోంది.

1981లో విడుదలైన ఈ సినిమాలోని కమల్‌హాసన్‌ ఓ ఇంటర్వ్యూకు హాజరుకాగా.. ఆయన్ను ఇంటర్వ్యూ చేస్తున్న అధికారులు ‘మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు?’ అని ప్రశ్నిస్తారు. దీనికి కమల్‌ బదులిస్తూ.. 'ఈ రోజా.. నిన్నా.. మొన్ననా..? ఎందుకంటే అక్కడ రోజుకొకరు మారుతున్నారు కదా!' అని బదులిచ్చాడు.

ప్రస్తుతం మహారాష్ట్రలోనూ అలాంటి పరిస్థితే నెలకొంది. గత శనివారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దేవేంద్ర ఫడణవీస్‌.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో నిన్న రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ నెల 28న శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. 'మహా' తాజా రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా అప్పట్లో కమల్‌ సినిమాలో చెప్పిన సమాధానం సరిపోలి వుండటం వల్ల ఆ వీడియోను నెటిజన్లు తెగ షేర్‌ చేస్తున్నారు.

ఇది చదవండి: బాంబు పేలి టాలీవుడ్ హీరో సందీప్​ కిషన్​కు గాయాలు

ABOUT THE AUTHOR

...view details