సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ కాలికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. చెన్నైలోని శ్రీరామచంద్ర ఆసుపత్రిలో కమల్ హాసన్‌కు చేసిన శస్త్రచికిత్స విజయవంతమైందని ఆయన కుమార్తెలు శ్రుతి హాసన్, అక్షరా హాసన్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
కమల్‌కు సర్జరీ.. ఐదు రోజుల తర్వాత డిశ్చార్జ్ - కమల్‌కు లెగ్ సర్జరీ
లోకనాయకుడు కమల్ హాసన్.. కాలికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆపరేషన్ విజయవంతంగా పూర్తయ్యిందని ఆయన కుమార్తెలు శ్రుతి హాసన్, అక్షరా హాసన్‌లు ట్విట్టర్లో వెల్లడించారు.
కమల్‌కు సర్జరీ.. ఐదు రోజుల తర్వాత డిశ్చార్జ్
ప్రస్తుతం కమల్ పరిస్థితి బాగుందని, నాలుగైదు రోజుల్లోనే ఇంటికి వచ్చేస్తారని వారివురూ పేర్కొన్నారు. కమల్ హాసన్ కోసం ప్రార్థించిన వారికి, మద్దతు ఇచ్చిన వారికి శ్రుతి హాసన్, అక్షర హాసన్ కృతజ్ఞతలు తెలిపారు. కాలి శస్త్రచికిత్స నుంచి తమ తండ్రి వేగంగా కోలుకుంటారని ఆశాభావం వ్యక్తంచేశారు. విశ్రాంతి తీసుకుని కోలుకున్న తర్వాత కమల్ హాసన్ ప్రజలందరినీ కలుస్తారని శ్రుతి, అక్షర చెప్పారు.