తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అదరగొడుతున్న కమల్ సేనాపతి గెటప్​ - kamal haasan look from bharatiyudu 2

'భారతీయుడు 2' చిత్రం నుంచి కమల్​ హాసన్​కు సంబంధించిన లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం. సేనాపతి గెటప్​లో ఉన్న కమల్​ ఫొటో నెట్టింట వైరల్​గా మారింది.

కమల్

By

Published : Nov 8, 2019, 9:32 AM IST

అవినీతి పరుల గుండెల్లో కత్తి దించేందుకు సేనాపతి మళ్లీ వచ్చేశాడు. 90ఏళ్ల వయసుకు చేరుకున్నా అంతే తరగని దేశభక్తితో మరో యుద్ధానికి సిద్ధమయ్యాడు. మరి ఈ ప్రయాణంలో అతడికెదురైన సవాళ్లేంటి? ఈసారి సేనాపతి ముందున్న లక్ష్యాలేంటి? వంటివి తెలియాలంటే 'భారతీయుడు 2' వచ్చే వరకు వేచి చూడక తప్పదు.

కమల్‌హాసన్‌ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం 'భారతీయుడు 2'. కాజల్‌ కథానాయికగా నటిస్తోంది. సిద్ధార్థ్, వెన్నెల కిశోర్, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. తాజాగా ఈ సినిమాలోని కమల్​ లుక్​ ఒకటి నెట్టింట విడుదల చేసింది చిత్రబృందం.

కమల్ హాసన్

ఈ పోస్టర్‌లో కమల్‌.. సేనాపతి గెటప్‌లో ఓ పెద్ద కమాన్‌ కింద నుంచొని తీక్షణంగా ఆలోచిస్తున్నట్లుగా దర్శనమిచ్చాడు.

ఇవీ చూడండి.. ఆమంచి... మా మంచి హాస్య నటుడు

ABOUT THE AUTHOR

...view details