గురువుపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు తమిళ అగ్ర నటుడు కమల్ హాసన్. తన పుట్టినరోజును పురస్కరించుకుని స్వర్గీయ బాలచందర్ గౌరవార్థం ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ అయిన రాజ్ కమల్ ఫిల్మ్స్ నూతన భవనం ఎదురుగా ఈ విగ్రహం ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్ పాల్గొన్ని విగ్రహావిష్కరణ చేశాడు.
నిన్న కమల్ హాసన్ 65వ పుట్టినరోజు జరుపుకొన్నాడు. నాలుగేళ్ల ప్రాయంలోనే వెండితెరపై కనిపించిన కమల్‌ను మొదటిసారి హీరోగా పరిచయం చేసింది ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్. వీరి కాంబినేషన్లో 'అపూర్వ రాగంగళ్', 'మరో చరిత్ర', 'అందమైన అనుభవం', 'ఆకలి రాజ్యం', 'అంతులేని కథ' వంటి క్లాసికల్ హిట్స్ వచ్చాయి. వీరిద్దరూ కలిసి చేసిన చివరి చిత్రం 'పరవశం'.