బుధవారం రాత్రి 'భారతీయుడు-2' షూటింగ్లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. అనంతరం వారి కుటుంబాలకు సంఘీభావం తెలిపిన కమల్.. వారికి ఆర్థిక సహాయం చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన తన ముగ్గురు స్నేహితుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఇస్తున్నట్లు పేర్కొన్నాడు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూస్తామని హామీ ఇచ్చాడు.
ప్రమాద మృతుల కుటుంబాలకు కమల్ ఆర్థిక సాయం - Kajal Aggarwal news latest
'భారతీయుడు-2' షూటింగ్లో క్రేన్ అదుపుతప్పి చనిపోయిన ముగ్గురు సిబ్బందికి కోటి రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించాడు హీరో కమల్‌హాసన్.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. చిత్రీకరణలో భాగంగా ఈవీపీ స్టూడియోలో లైటింగ్ కోసం సెట్ వేస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి 150 అడుగుల ఎత్తు నుంచి క్రేన్ తెగి చిత్రబృందం ఉండే టెంట్‌పై పడింది. మృతుల్లో దర్శకుడు శంకర్ వ్యక్తిగత సహాయకుడు మధు(29), అసిస్టెంట్ డైరెక్టర్ సాయికృష్ణ(34), సహాయకుడు చంద్రన్‌లు ఉన్నారు.
ఇదే విషయమై స్పందించిన హీరోయిన్ కాజల్ అగర్వాల్.. "భారతీయుడు-2’ సెట్‌లో మాతోపాటు పనిచేసే కృష్ణ, చంద్రన్, మధును నిన్న రాత్రి జరిగిన ప్రమాదంలో కోల్పోవడం బాధగా ఉంది. నా గుండెలోని బాధను బయటపెట్టడానికి మాటలు రావడం లేదు. మృతిచెందిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. దేవుడు వారికి మరింత ధైర్యాన్నివ్వాలని ప్రార్థిస్తున్నాను. నిన్న రాత్రి జరిగిన క్రేన్ ప్రమాదంతో నేనింకా షాక్‌లోనే ఉన్నాను. కేవలం కొన్ని క్షణాల వ్యవధిలో నేను ప్రమాదం నుంచి తప్పించుకుని ఈరోజు మీకు ఇలా ట్వీట్ చేయగలిగాను. ఆ ఒక్కక్షణం.. నాకు కాలం, జీవిత విలువ తెలిసింది" -కాజల్ అగర్వాల్, హీరోయిన్