తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఖైదీ' దర్శకుడితో కమల్​హాసన్​ కొత్త చిత్రం - లోకేష్​ కనకరాజ్ న్యూస్

విలక్షణ నటుడు కమల్​హాసన్​ కొత్త చిత్రానికి సంబంధించిన ప్రకటన వెలువడింది. కార్తీ హీరోగా తెరకెక్కిన 'ఖైదీ' సినిమాతో దర్శకుడిగా అలరించిన లోకేష్ కనకరాజ్​ ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. రాజ్​కమల్​ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్​ సంస్థ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది.

Kamal Haasan announces film with Master director Lokesh Kanagaraj
'ఖైదీ' దర్శకుడితో కమల్​హాసన్​ కొత్త చిత్రం

By

Published : Sep 17, 2020, 8:27 AM IST

తమిళ నటుడు కార్తీ హీరోగా నటించిన 'ఖైదీ' తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించింది. ఆ చిత్ర దర్శకుడు లోకేష్​ కనకరాజ్‌ అగ్ర కథానాయకుడు కమల్‌హాసన్‌తో ఓ సినిమా చేయబోతున్నారు. కమల్‌ 232వ చిత్రాన్ని లోకేష్‌ దర్శకుడిగా తెరకెక్కించబోతున్నారు. రాజ్‌కమల్‌ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్‌ సంస్థ నిర్మించబోతోంది.

బుధవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. 'ఒకప్పుడు అక్కడ ఒక దెయ్యం నివసించింది' అని రాసున్న ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. అనిరుధ్‌ స్వరకల్పనలో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవికి విడుదల కాబోతోంది.

ABOUT THE AUTHOR

...view details