తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నందమూరి మల్టీస్టారర్​పై కల్యాణ్​రామ్ స్పందన - బాలకృష్ణ-ఎన్టీఆర్-కల్యాణ్​రామ్

ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' షోలో పాల్గొన్న నందమూరి కల్యాణ్​రామ్.. తమ కుటుంబ మల్టీస్టారర్ గురించి మాట్లాడాడు. రేపు(సోమవారం) ఈ కార్యక్రమం ప్రసారం కానుంది.

నందమూరి మల్టీస్టారర్​పై కల్యాణ్​రామ్ స్పందన
బాలకృష్ణ-ఎన్టీఆర్-కల్యాణ్​రామ్

By

Published : Jan 12, 2020, 5:52 PM IST

హీరో కల్యాణ్​రామ్.. తమ కుటుంబ మల్టీస్టారర్​ గురించి మాట్లాడాడు. బాబాయ్ బాలకృష్ణ, తమ్ముడు తారక్​తో కలిసి నటించే విషయంపై స్పందించాడు. సోమవారం ఈటీవీలో ప్రసారం కానున్న 'ఆలీతో సరదాగా' టాక్​షోలో ఈ విషయం చెప్పనున్నాడు. తాజాగా విడుదల చేసిన ఈ ప్రోగ్రాం ప్రోమోలో ఇందుకు సంబంధించిన ఓ సరదా సంభాషణను పంచుకున్నారు.

వారిద్దరితో కలిసి తనకు నటించే అవకాశమొస్తే, అందులోని ఐటమ్​ సాంగ్​లో ఇలా వచ్చి అలా వెళ్లే పాత్ర చేస్తానని అన్నాడు కల్యాణ్​రామ్. మరి ఈ క్రేజీ కాంబినేషన్​ త్వరలో నిజం కాబోతుందేమో చూడాలి. ప్రస్తుతం ఈ కథానాయకుడు 'ఎంత మంచివాడవురా!'లో నటించాడు. సంక్రాంతి కానుకగా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details