నందమూరి కల్యాణ్‌రామ్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. 'ఉప్పెన'తో హిట్ కొట్టి, అగ్రహీరోలతో చిత్రాలు చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్.. దీనిని నిర్మిస్తోంది. రాజేంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మార్చి రెండో వారం నుంచి షూటింగ్ జరపనున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
కల్యాణ్‌రామ్‌తో 'ఉప్పెన' నిర్మాతల కొత్త సినిమా - మైత్రీ మూవీ మేకర్స్
వరుస సినిమాలు చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్.. నందమూరి కల్యాణ్‌రామ్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధమైంది. యువ దర్శకుడు రాజేంద్రకు అవకాశమిచ్చింది.
![కల్యాణ్‌రామ్‌తో 'ఉప్పెన' నిర్మాతల కొత్త సినిమా kalyan ram new movie with mythri movie makers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10630690-485-10630690-1613361615409.jpg)
కల్యాణ్‌రామ్‌తో 'ఉప్పెన' నిర్మాతల కొత్త సినిమా
ఇప్పటికే చిరంజీవి, పవన్‌కల్యాణ్, ప్రభాస్, జూ.ఎన్టీఆర్, బాలకృష్ణలతో కొత్త ప్రాజెక్టులు ప్రకటించిన మైత్రీ మూవీ మేకర్స్.. ఫుల్ ఫామ్‌లో ఉంది. దీనితో పాటే కొత్త దర్శకులకు అవకాశాలిస్తూ ప్రోత్సహిస్తోంది.
ఇవీ చదవండి:
Last Updated : Feb 15, 2021, 11:17 AM IST