'ఎంత మంచివాడవురా' చిత్రంతో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల్ని పలకరించాడు కల్యాణ్ రామ్. సతీశ్ వేగేశ్న దర్శకుడు. తర్వాత ఏ చిత్రం చేస్తున్నాడా అని ఆసక్తిగా ఎదురు చూశారు అభిమానులు. ఇప్పటి వరకు తన తదుపరి చిత్రం ఎవరితో చేస్తున్నాడో చెప్పకుండా సరికొత్త లుక్ ప్రయత్నించాడు. ఇటీవలే సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన కల్యాణ్ ఫొటో చూస్తే అది అర్థమవుతుంది.
కల్యాణ్ రామ్ కొత్త చిత్రం వివరాలు ఆరోజే? - Kalyan Ram new movie updates
నందమూరి హీరో కల్యాణ్ రామ్ ఈ ఏడాది ఎంత మంచివాడవురా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. అయితే తన తర్వాత చిత్రం ఎవరితో చేస్తున్నాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.
కల్యాణ్
జుత్తు, గడ్డం పెంచి మాస్ లుక్‌లో దర్శనమిచ్చాడు. దీన్ని చూసిన వారంతా కల్యాణ్ భారీ యాక్షన్ చిత్రానికే ప్రణాళికలు రచించాడని అనుకున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ ప్రశ్నకు సమాధానం దొరకనుందని టాలీవుడ్ వర్గాల సమాచారం. సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మే 28న తన తదుపరి ప్రాజెక్టు గురించిన విశేషాలు చెప్పనున్నాడని తెలుస్తోంది.