నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'ఎంత మంచివాడవురా'. దసరా పండుగ సందర్భంగా.. బుధవారం టీజర్‌ను విడుదల చేశారు. పల్లెటూరి నేపథ్యంలో సాగుతూ సినిమాపై ఆసక్తి రేపుతోంది.
'అందరూ మంచోడు మంచోడు అంటున్నారు... మరి ఇలా కొడుతున్నావ్ ఏంట్రా' అని విలన్ అడగ్గా.. 'రాముడు కూడా మంచోడేరా కానీ రావణాసురుడిని వెసేయలేదా?' అంటూ కల్యాణ్‌రామ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది.