నందమూరి కల్యాణ్ రామ్ తన 17వ సినిమాను ప్రకటించేశారు. సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహించనున్నారు. మెహరీన్ కథానాయిక. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాకు శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాత. గోపీ సుందర్ సంగీతం అందించనున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
కల్యాణ్‌రామ్ కొత్త సినిమా మార్చిలో విడులదైన '118' చిత్రంతో మంచి విజయం అందుకున్నాడు కల్యాణ్ రామ్. కేవీ గుహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కల్యాణ్ కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది.
'ఎఫ్2' సినిమాలో వెంకీ మరదలు పాత్రలో "హని ఈజ్ ది బెస్ట్ అంటూ" హంగామా చేసింది మెహరీన్. ఇప్పటి వరకూ ఆమె నటించిన చిత్రాల సంఖ్య తక్కువే అయినా 'ఎఫ్2' సినిమాతో ఈ అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆఫర్లు వస్తున్నా పాత్రల ఎంపికలో మాత్రం ఆచితూచి అడుగువేస్తోంది. తెలుగులోనే కాకుండా మధ్యమధ్యలో ఇతర భాషా చిత్రాల్లోనూ నటించింది. ఇప్పటి వరకు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో వచ్చిన చిత్రాలను చూస్తే కథానాయికల పాత్రలు చాలా అందంగా, సున్నితంగా ఉంటాయి. ఈ సినిమాతో మెహరీన్ టాప్‌లోకి వెళ్లిపోవడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.
ఇవీ చూడండి:
కాజల్ బాటలోనే అందాల భామ హంసా..!