గత ఏడాది 'విజేత'తో హీరోగా పరిచయమయ్యాడు మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్‌దేవ్. తండ్రి కొడుకుల కథాంశంతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ అతడి నటనకు మంచి మార్కులే పడ్డాయి. మళ్లీ ఇప్పుడు తన కొత్త సినిమా పేరు ప్రకటించాడు. అల్లు అర్జున్ హిట్ సాంగ్ 'సూపర్‌మచ్చి'నే టైటిల్‌గా పెడుతూ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను దీపావళి కానుకగా విడుదల చేశారు.
'సూపర్‌మచ్చి' అంటున్న మెగా అల్లుడు - హీరో కల్యాణ్‌దేవ్
హీరో కల్యాణ్‌దేవ్ నటిస్తోన్న కొత్త చిత్రానికి 'సూపర్‌మచ్చి' అనే టైటిల్ ఖరారు చేశారు. దీపావళి కానుకగా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను పంచుకుంది చిత్రబృందం.
హీరో కల్యాణ్‌దేవ్
మాస్‌లుక్‌లో కనిపిస్తూ కల్యాణ్‌దేవ్ అలరిస్తున్నాడు. రేహా చక్రవర్తి హీరోయిన్గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. పులి వాసు దర్శకత్వం వహిస్తున్నాడు. రిజ్వాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకుంది. వచ్చే వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది చదవండి: ముద్దు పెట్టిన హీరోయిన్ శ్రియ.. వీడియో వైరల్