తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పోలీస్ ​లుక్​లో రాజశేఖర్ మరోసారి..! - అదా శర్మ

వినూత్న కథాంశంతో తెరకెక్కుతున్న 'కల్కి' సినిమా కమర్షియల్ ట్రైలర్ విడుదలైంది. హీరో రాజశేఖర్ మరోసారి పోలీస్ పాత్రలో అదరగొట్టేందుకు సిద్ధమయ్యాడు.

పోలీస్ ​లుక్​లో రాజశేఖర్ మరోసారి..!

By

Published : May 9, 2019, 5:22 PM IST

టాలీవుడ్ హీరో రాజశేఖర్​ మరోసారి పోలీస్​గా మెప్పించేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం 'కల్కి' సినిమాలో అదే పాత్ర పోషిస్తున్నాడు. చిత్రానికి సంబంధించిన కమర్షియల్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. హీరోయిన్​గా అదా శర్మ, కీలక పాత్రలో నందిత శ్వేత కనిపించనున్నారు.

భగవద్గీతలోని కర్మ సిద్ధాంతంతో ట్రైలర్​ ప్రారంభమైంది. అనంతరం రాజశేఖర్ ఎంట్రీ అభిమానుల్ని ఆకట్టుకునేలా ఉంది. సినిమాలోని ఇతర పాత్రల్లో నాజర్, రాహుల్ రామకృష్ణ నటించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతమందించాడు. సి.కల్యాణ్.. శివాని-శివాత్మిక మూవీస్​తో కలిసి సంయుక్తంగా నిర్మించారు. 'అ!' సినిమాతో ఆకట్టుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: టైటానిక్ మరోసారి మునిగిపోయింది...!

ABOUT THE AUTHOR

...view details