వెటరన్ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణవార్తపై కళాతపస్వి కె. విశ్వనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని తాను అనుకోలేదన్నారు.
"భగవంతుడు ఇంత అన్యాయం చేస్తాడనుకోలేదు. బాలు నా సోదరుడే కాదు. నా ఆరోప్రాణం. అలాంటిది ఇంత తొందరగా మమల్ని వీడి వెళతాడనుకోలేదు. ఇలాంటి సమయంలో మాట్లాడటానికి మాటలు కూడా రావడం లేదు. భగవంతుడు బాలు ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నా. బాలు కుటుంబ సభ్యులంతా ఈ విషయాన్ని ఓర్చుకోవాలని కోరుతున్నా."