తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'కళంక్'లోని పాటకు మాధురి అదిరే స్టెప్పులు - alia bhatt

కళంక్ సినిమాలోని 'తబా హో గయే' అంటూ సాగే గీతం విడుదలైంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్​ మాధురీ దీక్షిత్.. తన నృత్య అభినయంతో ఆకట్టుకుంది.

'కళంక్'లోని పాటకు మాధురి అదిరే స్టెప్పులు

By

Published : Apr 9, 2019, 5:46 PM IST

తన నటనతోనే కాకుండా డ్యాన్స్​తోనూ ఆకట్టుకుంటున్న హీరోయిన్​ మాధురీ దీక్షిత్. ప్రస్తుతం 'కళంక్' సినిమాలో నటించింది. ఇందులోని 'తబా హో గయే' అనే పాటను చిత్రబృందం ఈ రోజు విడుదల చేసింది. 51 ఏళ్ల వయసులోనూ తన నృత్యంతో సినీ ప్రియుల్ని అలరించేందుకు సిద్ధమైందీ బాలీవుడ్ సుందరి. ఇంతకంటే బాగా ఎవరూ డ్యాన్స్ చేయలేరేమో అనేంతలా నర్తించింది​.

ప్రధాన పాత్రల్లో వరుణ్ ధావన్, ఆలియా భట్, ఆదిత్య రాయ్ కపూర్, సోనాక్షి సిన్హా, సంజయ్ దత్ నటించారు. బహార్ బేగమ్​ పాత్రలో మాధురి కనిపించనుంది. ప్రత్యేక గీతంలో కృతి సనన్, కియారా అడ్వాణీ నర్తించారు. అభిషేక్ వర్మన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 17న థియేటర్లలోకి రానుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details