బాలీవుడ్లో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న సినిమా పేరు 'కళంక్'. ఈ చిత్రంలో మాధురి దీక్షిత్, సంజయ్ దత్, వరుణ్ ధావన్, ఆదిత్య రాయ్ కపూర్, ఆలియా భట్, సోనాక్షి సిన్హా వంటి భారీ తారగణం ఉండటమే ఇందుకు కారణం. వీరితో పాటు కృతి సనన్ ప్రత్యేక గీతంలో నర్తించింది. సంబంధించిన పాటను చిత్రబృందం విడుదల చేసింది. ఫస్ట్‌క్లాస్ అనే గీతంలో కియారా అడ్వాణీ కనిపించనుంది.
కళంక్ పాట :ఆకట్టుకున్న కృతి సనన్ డ్యాన్స్ - కృతి సనన్ ప్రత్యేక గీతం
కళంక్ సినిమాలోని 'అయిరా గైరా...' అంటూ సాగే గీతం నెట్టింట సందడి చేస్తోంది. ఈ పాటలో కృతి సనన్ స్టెప్పులతో అదరగొట్టింది.
కళంక్ పాట: ఆకట్టుకున్న కృతి సనన్ డ్యాన్స్
ఇప్పటికే వచ్చిన పాటలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. అభిషేక్ వర్మన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కరణ్ జోహార్, షాజిద్ నడియావాలా నిర్మాతలుగా వ్యవహరించారు. వేసవి కానుకగా ఏప్రిల్ 17న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
ఇది చదవండి: 'కళంక్'లోని పాటకు మాధురి అదిరే స్టెప్పులు