తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'బాహుబలి' లాంటి భారీ సెట్​లో 'కళంక్​' - ఆలియా భట్‌

బాలీవుడ్​లో భారీ తారాగణం, వ్యయంతో  నిర్మిస్తున్న చరిత్రాత్మక చిత్రం కళంక్​. ఈ సినిమాలోని పాటలు, ట్రైలర్​ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సినిమా కోసం వేసిన ప్రత్యేకమైన సెట్​ మేకింగ్ వీడియో విడుదల చేసింది చిత్రబృందం.

బాహుబలి లాంటి సెట్​లో అబ్బురపరుస్తున్న 'కళంక్'

By

Published : Apr 8, 2019, 4:00 PM IST

చరిత్రకు సజీవ సాక్ష్యాలు కోటలు, ఆనాటి రాజుల ఉపకరణాలు.. మరి అలాంటి నేపథ్యంలో చిత్రాలు తెరకెక్కించాలంటే.. ఆ కాలంలోని కట్టడాలు, జీవన విధానం ప్రతిబింబించేందుకు భారీ సెట్లు వేస్తుంటారు దర్శక నిర్మాతలు. కోట్ల ఖర్చుకూ వెనుకాడరు. ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న బాహుబలి సినిమా సైతం అద్భుతంగా రావడానికి ఈ సెట్లే కీలకంగా వ్యవహరించాయి. ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ప్రస్తుతం బాలీవుడ్​లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న 'కళంక్'​ చిత్రంలోనూ ఇలాంటి ఓ సెట్​ కనువిందు చేయనుంది. ప్రేక్షకులు, అభిమానులకు ఈ సినిమా చిత్రీకరణ చేసిన ప్రాంతం, తెరకెక్కించేందుకు పడిన కష్టం తెలపాలనుకుంది చిత్రబృందం. ఓ చిన్నపాటి వీడియోను విడుదల చేసింది.

  1. ఈ వీడియోలో వరుణ్​ ధావన్​ సెట్​ విశేషాలు చెప్తూ కనిపిస్తే.. ఆ సెట్​ను సందర్శించిన ప్రముఖులు అబ్బురపడ్డారు. హుస్నాబాద్‌లో 1945 కాలాన్ని తలపిస్తూ ఓ టౌన్‌షిప్‌ను రూపొందించారు. దాదాపు 700 మంది.. మూడు నెలలు కష్టపడి ఈ అందమైన సెట్స్‌ను రూపొందించినట్లు తెలిపింది చిత్రబృందం.
  2. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు ఓ యువరాణికి, ఓ సాధారణ వ్యక్తికి మధ్య పుట్టిన ప్రేమకథ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతోంది. ఇందులో రూప్‌ అనే యువరాణి పాత్రలో ఆలియా నటించింది. ఏప్రిల్‌ 17న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
  3. సినిమాకు అభిషేక్‌ వర్మన్‌ దర్శకత్వం వహించారు. బాలీవుడ్‌ ప్రముఖ నటులు సంజయ్‌ దత్, మాధురీ దీక్షిత్‌, వరుణ్‌ ధావన్‌, ఆలియా భట్‌, సోనాక్షి సిన్హా, ఆదిత్య రాయ్‌ కపూర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.

ABOUT THE AUTHOR

...view details