అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కలంక్'. ఈ చిత్రంలో సంజయ్ దత్, వరుణ్ ధావన్, ఆదిత్యారాయ్ కపూర్, సోనాక్షి సిన్హా, అలియా భట్, మాధురీ దీక్షిత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సినిమాలోని మహిళా పాత్రధారుల పేర్లతో వారి లుక్ను విడుదల చేసింది చిత్రబృందం.
'కలంక్' మహిళా పాత్రలు ఇవే
బాలీవుడ్ 'కలంక్' చిత్రంలోని మహిళా పాత్రల లుక్ను విడుదల చేసింది చిత్రబృందం.
సోనాక్షి, మాధురీ, అలియా
మొదటగా అలియా భట్ లుక్ విడుదల చేసింది. రూప్గా ఆకట్టుకోనుంది అలియా. సోనాక్షి సిన్హా సత్య చౌదరిగా, మాధురీ దీక్షిత్ బహార్ బేగంగా అలరించనున్నారు.
గురువారం పురుషుల పాత్రల పేర్లతో వారి లుక్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కరణ్ జోహర్ నిర్మిస్తున్నారు.