వరుణ్ ధావన్, అలియా భట్, సోనాక్షి సిన్హా, సంజయ్‌దత్, మాధురీ దీక్షిత్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం 'కలంక్'. పౌరాణిక డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తైంది. అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మిస్తున్నాడు. తాజాగా పురుషుల పాత్రల పేర్లతో వారి లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
'కలంక్' పాత్రలు ఇవే.. - కరణ్ జోహార్
వరుణ్ ధావన్, అలియా భట్, సోనాక్షి సిన్హా, సంజయ్‌దత్, మాధురీ దీక్షిత్, ఆదిత్యరాయ్ కపూర్ ప్రధానపాత్రలు పోషిస్తున్న చిత్రం'కలంక్'. సినిమాలోని పురుషుల లీడ్ పాత్రల లుక్‌ను విడుదల చేసింది చిత్ర బృందం.
!['కలంక్' పాత్రలు ఇవే..](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2632803-448-2ee98943-88f9-42a1-915c-b06dfcf9296e.jpg)
కలంక్
మొదటగా వరుణ్ ధావన్ లుక్‌ను విడుదల చేసింది. జాఫర్‌గా వరుణ్ ఈ చిత్రంలో అలరించనుండగా.. దేవ్ చౌదరిగా ఆదిత్యరాయ్ కపూర్ ఆకట్టుకోనున్నాడు. సీనియర్ కథానాయకుడు సంజయ్‌దత్ 'బాల్‌రాజ్ చౌదరి' పాత్ర పోషిస్తున్నాడు.