ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న 'కళంక్' చిత్ర ప్రచారం జోరుగా సాగుతోంది. తాజాగా సినిమాలోని రెండో పాట 'ఫస్ట్ క్లాస్'ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ సాంగ్‌లో కియరా అడ్వాణీ, వరుణ్ ధావన్‌తో కలిసి స్టెప్పులేసింది.
- 1940 కాలానికి చెందిన ప్రేమకథగా ఈ చిత్రం రూపొందుతోంది. స్వాతంత్య్రం రాకముందు ఓ యువరాణికి, సామాన్య వ్యక్తికి మధ్య జరిగిన ప్రేమకథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో సంజయ్ దత్, మాధురీ దీక్షిత్, అలియా భట్, వరుణ్ ధావన్, సోనాక్షి సిన్హా, ఆదిత్యరాయ్ కపూర్ ప్రధానపాత్రలు పోషిస్తున్నారు.