RRR pre release event chennai: 'ఆర్ఆర్ఆర్' పబ్లిసిటీ రాకెట్ స్పీడ్లో దూసుకుపోతుంది. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా చిత్రబృందం ప్రచారంలో రయ్ రయ్ అంటూ పరుగెడుతుంది. ఈ క్రమంలోనే చెన్నైలో సోమవారం.. 'ఆర్ఆర్ఆర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో భాగంగా 'అసురన్' నిర్మాత కలైపులి ఎస్.థాను ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
"రాజమౌళిని నమ్మి రూ.1000 కోట్లయినా బడ్జెట్ పెట్టొచ్చు. ఎందుకంటే ఆయన దానిని రూ.2000 కోట్లు చేసి పెడతాడు. 'ఆర్ఆర్ఆర్' తమిళంలో కూడా పెద్ద హిట్ అవుతుంది" అని ఎస్.థాను చెప్పారు.