తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నాగ్​ చిత్రంలో కాజల్​ పాత్ర ఇదేనా? - praveen sattaru nagarjuna movie

నాగార్జున-కాజల్​ జంటగా ప్రవీణ్​ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఇందులో కాజల్ ప్రతినాయకురాలిగా ​కనిపిస్తుందని ప్రచారం సాగుతోంది.

kajol agarwal
కాజల్​ అగర్వాల్​

By

Published : Aug 28, 2021, 3:43 PM IST

స్టార్​ హీరోయిన్​ కాజల్​ అగర్వాల్.. పెళ్లి తర్వాత వరుస సినిమాలతో దూకుడు చూపిస్తోంది. చిరంజీవి 'ఆచార్య' చేస్తున్న ఈ భామ.. నాగార్జునతోనూ కలిసి నటిస్తోంది. ప్రవీణ్ సత్తారు​ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కాజల్​ రా ఏజెంట్​గా కనిపించనుంది. అయితే ఈ పాత్రకు నెగటివ్​ షేడ్స్​ ఉంటాయని ప్రస్తుతం జోరుగా ప్రచారం సాగుతోంది. అంతకుముందు వేశ్య పాత్ర అని కూడా ప్రచారం సాగింది. దీంతో కాజల్​.. ఈ రెండింటిలో ఏ పాత్ర పోషించనుందో అంటూ అభిమానులు తెగ మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ దీనిపై స్పష్టత రావాలంటే సినిమా వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.

కాజల్​

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. హై ఓల్టేజ్​ యాక్షన్​ డ్రామాగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇందుకోసం నాగ్​.. క్రావ్‌ మాగా, సమురై స్వొర్డ్‌ అనే ఇజ్రాయెల్‌ యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకున్నారని తెలిసింది. శ్రీవేంకటేశ్వర ఎల్‌ఎల్‌పీ, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి.

ఇదీ చూడండి: కాజల్​ ఫిట్​నెస్​ సీక్రెట్​ తెలుసా?

ABOUT THE AUTHOR

...view details