టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.. పెళ్లి టాపిక్ మరోసారి చర్చనీయాంశమైంది. ఇప్పటికే ముంబయికి చెందిన గౌతమ్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోనున్నట్లు కొంత కాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా అతడితో నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతా సరిగ్గా జరిగితే వచ్చే ఏడాది వీరిద్దరు పెళ్లి పీటలు ఎక్కనున్నారని సమాచారం.
ఇప్పటికే కాజల్.. తన సహ నటులతో ఎఫైర్లో ఉన్నట్లు ఎన్నో రూమర్స్ వచ్చాయి. వాటిలో ఎటువంటి నిజం లేదని స్పష్టం కూడా చేసిందీ ముద్దుగుమ్మ.