తెలంగాణ

telangana

By

Published : Sep 4, 2019, 12:52 PM IST

Updated : Sep 29, 2019, 9:53 AM IST

ETV Bharat / sitara

లాల్​బాగ్​ గణేశునికి కాజల్​ ప్రత్యేక పూజలు

దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రముఖ నటి కాజల్​ అగర్వాల్..​ ముంబయిలో ప్రఖ్యాత లాల్​బాగ్ ఆలయానికి వచ్చి గణనాథుడిని దర్శించుకుంది.

కాజల్ అగర్వాల్

దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ముంబయి లాల్​బాగ్ ఆలయానికి టాలీవుడ్ నటి కాజల్ అగర్వాల్ విచ్చేసింది. వినాయక ఉత్సవాల సందర్భంగా గణనాథుడుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించింది. తల్లితో కలిసి దర్శనం చేసుకుని విఘ్నేశ్వరుడి సేవలో పాల్గొంది.

లాల్​బాగ్​ గణేశుని ఆలయంలో కాజల్​ ప్రత్యేక పూజలు

ఈ ఏడాది 'సీత', 'రణరంగం', 'కోమలి' సినిమాలతో సందడి చేసింది కాజల్. ప్రస్తుతం తమిళంలో 'భారతీయుడు 2', సూర్యతో కలిసి ఓ చిత్రంలోనూ నటిస్తోంది. బాలీవుడ్​లో 'ముంబయి సాగా'లో టీనేజీ​ అమ్మాయి పాత్రలో కనిపించనుంది. జాన్​ అబ్రహాం, ఇమ్రాన్​ హష్మి హీరోలుగా నటిస్తున్నారు.

ఇదీ చూడండి: వంద మంది డ్యాన్సర్లతో కంగనా సందడి!

Last Updated : Sep 29, 2019, 9:53 AM IST

ABOUT THE AUTHOR

...view details