తన నటన, గ్లామర్‌తో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఇప్పటివరకూ సినిమాలతో అలరించిన ఈమె త్వరలో డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌పైనా సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. హాలీవుడ్ సిరీస్ 'క్వాంటికో' రీమేక్‌లో ప్రధాన పాత్ర పోషించనుందని సమాచారం. మాతృకలో ప్రియాంక చోప్రా చేసిన రోల్‌ను ఇక్కడ కాజల్ చేయనుందట.
హాలీవుడ్ వెబ్‌సిరీస్ రీమేక్‌లో కాజల్? - కాజల్ అగర్వాల్ వెబ్ సిరీస్
ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్.. హాలీవుడ్ వెబ్‌సిరీస్ 'క్వాంటికో' రీమేక్‌లో నటించనుందని సమాచారం. ఈ విషయమై త్వరలో అధికారిక ప్రకటన రానుంది.

హాలీవుడ్ వెబ్‌సిరీస్ రీమేక్‌లో కాజల్?
ఈ సిరీస్ రీమేక్‌ను తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ విషయమై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
కాజల్.. కమల్ హాసన్ నటిస్తున్న 'భారతీయుడు 2' లో ప్రస్తుతం నటిస్తోంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. 1996లో వచ్చిన 'భారతీయుడు' చిత్రానికి కొనసాగింపుగా దీనిని తెరకెక్కిస్తున్నారు.