ప్రెగ్నెన్సీతో ఉన్న హీరోయిన్ కాజల్ అగర్వాల్.. భర్తతో కలిసి ఇటీవల దుబాయ్ వెళ్లి వచ్చింది. అక్కడ తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, తన శరీరం, ముఖం గురించి పలువురు నెటిజన్లు విపరీత కామెంట్లు చేశారు. దీంతో వారిపై ఫైర్ అయిన కాజల్.. తాను అలాంటి పట్టించుకోనని బదులిచ్చింది. సోషల్ మీడియాలో చాలా పెద్ద పోస్ట్ పెట్టింది.
"గర్భం వల్ల నా జీవితంతో పాటు శరీరంలో కొత్త మార్పులు కనిపిస్తున్నాయి. వీటిని స్వీకరించడం అలవాటు చేసుకుంటున్నాను. ఈ మార్పులకు అదనంగా నా శరీరంపై కామెంట్స్, ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి కామెంట్స్ వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు. ఇతరుల పట్ల సానుభూతి చూపడం, దయతో ఉండటం కష్టమే. ఆనందంగా ఉందాం. ఎదుటివారిని జీవించనిద్దాం" అని కాజల్ తన సోషల్ మీడియాలో ఖాతాలో రాసుకొచ్చింది.