యువ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను ఇటీవలే పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్.. తొలిసారి తన ప్రేమకథ గురించి చెప్పింది. వివాహం జరిగిన రెండు రోజుల తర్వాత ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది. అంతకు ముందు కాజల్‌కు శుభాకాంక్షలు చెబుతూ పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
"మా ఇద్దరికి పదేళ్ల ముందు నుంచే పరిచయముంది. ఏడేళ్ల నుంచి స్నేహితులుగా ఉన్నాం. మూడేళ్లుగా డేటింగ్లో ఉన్నాం. ఈ ఏడాది ప్రారంభంలో గౌతమ్, నాకు ప్రపోజ్ చేశారు. అప్పుడు చాలా హృదయపూర్వక, భావోద్వేగ సంభాషణ జరిగింది" అని కాజల్ వెల్లడించింది.